Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నేను శైలజ'లో కీర్తి సురేశ్ పాత్రను నేను చేయాల్సింది: నిహారిక

  • ఈ రోజే థియేటర్లకు వచ్చిన 'సూర్యకాంతం'
  • 'నేను శైలజ' కోసం నన్ను అడిగారు
  •  అప్పటికి నేను ఇంట్లో వాళ్లను ఒప్పించలేదు
నిహారిక తన అభిరుచికి తగిన సినిమాలు చేసుకుంటూ వస్తోంది. గ్యాప్ ను పట్టించుకోకుండా మంచికథ కోసం .. మంచి పాత్ర కోసం వెయిట్ చేస్తూ అవకాశాలను సొంతం చేసుకుంటోంది. అలా తాజాగా ఆమె చేసిన 'సూర్యకాంతం' చిత్రం ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చింది.

"ఒక్కోసారి చేతివరకూ వచ్చిన మంచి అవకాశాలు మరొకరికి వెళ్లిపోతుంటాయి. అలా వెళ్లిన సినిమాలు హిట్ అయినప్పుడు 'అయ్యో ఆ సినిమా చేసి వుంటే బాగుండేదే' అనిపిస్తూ ఉంటుంది. నాక్కూడా అలాంటి అనుభవం ఎదురైంది. 'నేను శైలజ' సినిమాలో కథానాయికగా ముందుగా నన్ను అడిగారు. అప్పుడు నేను యాక్టింగ్ వైపుకు వెళతానని మా ఇంట్లో వాళ్లని ఒప్పించే పనిలో వున్నాను. నా కోసం ఆ సినిమా వాళ్లు నెల రోజుల పాటు వెయిట్ చేశారు. నా నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో, 'కీర్తి సురేశ్' ను తీసుకున్నారు. ఆ సినిమా ఎంత హిట్ అయిందో మీకు తెలిసిందే" అని చెప్పుకొచ్చింది.
niharika

More Telugu News